రక్తదానం అనగా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం -ఎస్సై ఎన్ శ్రీధర్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ శ్రీధర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామగుండం సి పి రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరాన్ని తేదీ O2-10-2023 నాడు ఉదయం 7 గంటల నుంచి పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు మెగా రక్తదాన శిభిరం నిర్వహించడం జరుగుతుంది. సుమారు 6006 మందితో మొట్టమొదటిసారిగా పోలీస్ శాఖ వారిచే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రక్తదాన శిబిరానికి మండలం లోని అన్నీ గ్రామాల నుండి అధిక సంఖ్యలో యువకులు పాల్గొని సికిల్ సెల్ వ్యాధితోబాధపడుతున్న వారికోసం, తల సేమియా బాధపడుతున్న చిన్నారుల కోసం, రక్తహీనతతో బాధపడే వారి కోసం, నెలలు తక్కువగా పుట్టిన వారికి మరియు బరువు తక్కువ పుట్టిన వారి కోసం, ప్రమాదానికి గురైన వారికి, గాయాల పాలైన వారికి,ఆపరేషన్ అవసరమైన వారి కోసం అవయవ మార్పిడి అవసరమైన వారి కోసం ఉచితంగా ఈ రక్తాన్ని తెలంగాణ వ్యాప్తంగా అందించడం జరుగుతున్నది.కావున ఇట్టి గొప్ప కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.