హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ లో జరిగిన ఒక సమావేశంలో స్వతంత్ర అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా కొనసాగిన కెసిఆర్ దుష్ట పాలనను అంతం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకుంది. పెద్దల సభలో కూర్చోవాల్సింది ఎవరు? ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన 119 ఎమ్మెల్యేలు ఉండగా శాసన మండలితో పని ఏముంది? అసలు పెద్దల సభగా పిలువబడే శాసన మండలి ఎందుకు? అనే ముఖ్యమైన విషయాలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియని స్థితిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలు అవినీతిమయమై, ప్రజల సమస్యలను కనీసంగా కూడా పట్టించుకోని నేటి స్థితిలో పెద్దల సభలో మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రవేశించి ప్రజల సమగ్ర అభివృద్ధికి సూచనలు ఇచ్చి, చట్టాలు చేపించి ప్రజల అభివృద్ధికి కృషి చేయడం కోసం ఈ శాసన మండలి ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాంటి సభలో కూడా అలవికాని వాళ్ళు పోటీలో ఉన్నారు.
ఇలాంటి గంభీరమైన పరిస్థితుల్లో జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పోరాటయోదుడు, నిగర్వి, విద్య, వైద్య, ఉపాధి రంగాల పట్ల ప్రత్యేక విజన్ కలిగిన తాడిశెట్టి క్రాంతి కుమార్ కు బుద్ధిజీవులు, శ్రామికులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున మద్దతు పలకాల్సిన అవసరముంది. ఈ సమావేశాన్ని 23-05- 2024 న సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నందున ఇట్టి సమావేశానికి అందరూ విచ్చేసి మీ అభిప్రాయాలు తెలిపి తాడిశెట్టి క్రాంతి కుమార్ కు మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.