గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిచారు.
గ్రామాల్లో లీకేజీలు లేకుండా తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెరిచిన బావులను కప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీల్లోని ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, సూచించారు.
ప్రత్యేక అధికారులు తమ సేవలను ప్రజలకు చిరకాలం గుర్తుంచుకునేలా సేవలు అందించాలని, వారి పాలనలో స్పష్టమైన మార్పు వచ్చేలా చూడాలని సూచించారు.
మద్యం, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ముత్తపురం పంచాయితీ స్పెషల్ ఆఫీసర్, గుండాల తహసీల్దార్ రంగా, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, పంచాయితీ కార్యదర్శి వి సతీష్, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ టీచర్లు,ఆశావర్కర్లు, మిషన్ భగీరథ వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.