
Varyulu Tatiparthi Jeevan Reddy.
ఘనంగా
ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..
జగిత్యాల. రాయికల్. జులై 23, నేటి ధాత్రి:
కేక్ కట్ చేసి సంబురాలు..
ఏ ఐ సీ సీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీనాక్షి నటరాజన్ చిత్రం తో కూడిన కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి,జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అనంతరం మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి గా క్షేత్ర స్థాయిలో
పార్టీ బలోపేతమే ధ్యేయంగా పని చేస్తున్నారు.
రాహుల్ గాంధీ ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
పదేళ్లు బీ ఆర్ ఎస్ అరాచకాలను ను ఎదురించి నిల్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని కార్యకర్తల్లో భరోసా నింపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు.
మహిళలకు ఉచిత రవాణా, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ప్రతి క్వింటాల్ పై రూ.500 బోనస్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం..
గృహ అవసరాలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఒక్కటే అని స్పష్టం చేశారు.
జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్ కల్పించాలనే రాహుల్ గాంధీ ఆలోచన తో
కుల గణన చేపట్టి,42 శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నారు.
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడం తో పాటు విద్య, ఉద్యోగాలలో అమలు చేస్తాం.
2017 నాటికి కాంగ్రెస్ లో ఉన్న వారికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.