
చందర్తి, నేటిదాత్రి:
దక్షిణ కాశిగా పేరుగాంచిన సుప్రసిద్ధి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ జాతర మహోత్సవం సమీపిస్తుండగా చందుర్తి- మోత్కురావుపేట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని రహదారికి రాకపోకలకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు బుధవారం
మరమత్తు పనులు ప్రారంభించారు. అడవి ప్రాంతంలోని రోడ్డు అధ్వాన్నంగా మారింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జాతర మహోత్సవానికి తాత్కాలికంగా మట్టితో రోడ్డు వేసి ప్రత్యేక బస్సులు రెండు రోజులు నడిపించి మర్చిపోయేవారు. వర్షాలకు మళ్ళీ రోడ్డు అదే పరిస్థితి.
మహాశివరాత్రి జాతర కు జగిత్యాల ప్రాంతానికి చెందిన మేడిపల్లి, భీమారం, చందుర్తి మండల మీదులుగా వెళ్లేందుకు వీలుగా సౌకర్యార్థం చందుర్తి- మోత్కురావుపేట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని రహదారి మరమ్మత్తుకి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జెసిబి మిషన్ తో పనులు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జాతర మహోత్సవానికి తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేయించి గత ప్రభుత్వం మరిచిపోయిందని, అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చందుర్తి – మోత్కురావుపేట రహదారి పై ప్రస్తావించగా ప్రభుత్వం స్పందించిందని, అటవీ శాఖ అనుమతితో ప్రభుత్వ నిధులతో పక్కా రోడ్డు నిర్మిస్తుందని చందుర్తి జెడ్ పి టి సి సభ్యులు నాగం కుమార్,కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మపురి శ్రీనివాస్, పులి సత్యం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.