*ఆయనకు అండగా ఆమే..!*
*జర్నలిస్టులను హేళన చేస్తూ వ్యాఖ్యలు*
*సివిల్ దందాలో ఆ ఘనుడే అంతా తానై..*
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో జర్నలిస్టు ముసుగులో మెడికల్ మాఫియా దందా రోజుకు పేట్రేగిపోతున్నది. తన మెడికల్ ఏజెన్సీలో మందులు కొనుగోలు చేయని మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ తో తనిఖీలు నిర్వహించి రివేంజ్ తీర్చుకుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు సంబంధించిన మెడికల్ దందాలోనే కాకుండా పలు ప్రైవేట్ ఆస్పత్రులలో సెటిల్మెంట్లు చేస్తూ ఒక సెట్లర్ మారాడనడంలో సందేహం లేదు. మెడికల్ మాఫినే కాకుండా సివిల్ దందాలు తలదూర్చి ఒక ప్రముఖ ప్రభుత్వ వైద్యురాలకు వత్తాసు పలుకుతూ బాధితులను బెదిరిస్తున్నాడు ఈ ఘనుడు. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ వైద్యురాలు జర్నలిస్టులను హేళన చేస్తూ డబ్బులు ఇవ్వకపోతేనే వార్తలు రాస్తున్నారు అని వ్యాఖ్యలు చేస్తూ ఆ వ్యక్తికి సపోర్ట్ గా మాట్లాడడం పట్ల ఆమెపై పలువురు జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సుమారు 60 ఏళ్ల పైబడి చరిత్ర కలిగిన ఒక ప్రముఖ పత్రికలో నర్సంపేట ప్రతినిధిగా పనిచేసిన ఈ మెడికల్ మాఫియా ఒక సంవత్సరం పాటు ‘వికసించాడు.”
ఒక విలేకరి ముసుగులో తన మెడికల్ మాఫియాను ఒక డాన్ గా ఎదగాలని పలు ఆస్పత్రులపై వార్తా కథనాలు రాశాడని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నర్సంపేట పట్టణానికి చెందిన సంగెపు నరేష్ అనే యువకుడు తన తండ్రి జయప్రకాష్
నర్సంపేట పట్టణానికి చెందిన ఒక ప్రముఖ ప్రభుత్వ వైద్యురాలకు పట్టణ శివారులోని తన భూమిని విక్రయించాడు.రిజిస్ట్రేషన్ చేయకముందే ఆయన చనిపోయాడు.అందుకు ఇచ్చిన వీలునామ ప్రకారం సంబంధించిన
రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఈ మెడికల్ మాఫియా ఘనుడే సెటిల్ చేశాడు. భూమి విక్రయించిన యువకునికి బ్యాలెన్స్ ఉన్న డబ్బులు ఇచ్చే క్రమంలో వైద్యురాలు డబ్బులకు బదులుగా చెక్కు ఇచ్చింది.సదరు వ్యక్తి చెక్ ను బ్యాంకులో వేయగా వైద్యురాలి సంతకం మ్యాచింగ్ కాకపోవడంతో బ్యాంక్ అధికారులు డిఫాల్ట్ సిగ్నేచర్ అని ధృవీకరణ పత్రాన్ని బాధితుడికి ఇచ్చారు. చెక్ రాసి ఇచ్చిన వైద్యురాలి వద్దకు బాధితుడు వెళ్లగా జర్నలిస్టు అండతో ఎగకొట్టే ప్రయత్నం చేసింది. అది గమనించిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి చీటింగ్ కేసు పెట్టగా వైద్యురాలికి అండగా ఉన్న జర్నలిస్టు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన బాధితునికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.ఇప్పుడు ఆ ఆడియో కాస్త వాట్సాప్,ఇతర సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.