దేశానికే దిక్సూచిగా తెలంగాణ వైద్య ఆరోగ్యం


తెలంగాణలో జిల్లాకు మెడికల్ కళాశాల సహకారం
వేలాది మంది పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ
వైద్య సేవలు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి
తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో
రావడానికి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని
పేదలకు అతి చేరువలో తెస్తూ తెలంగాణ రాష్ట్రం
ప్రతి ఏటా పదివేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరుకుని భారతదేశ వైద్యరంగం భారతదేశ వైద్యరంగ చరిత్రలోనే ఓ తెల్ల కోటి విప్లవాన్ని సృష్టించి
దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర వైద్యరంగం
తెలంగాణకు గర్వకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలిపారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ వైద్య ఆరోగ్యం నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే
ఉజ్వలమైన దినం ఇది ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు
ప్రారంభించుకోవడం గొప్ప అదృష్టమని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఒకేసారి 9 మెడికల్ కళాశాలలు ప్రగతి భవనం నుండి
వర్చువల్ పద్ధతితో ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ‌ కేసీఆర్ మాట్లాడుతూ ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాం
కానీ ఈ కార్యక్రమం చాలా ఆత్మసంతృప్తి కలిగి ఓ గొప్ప సన్నివేశం ఎందుకంటే పరిస్థితులను చూసాము అటువంటి తెలంగాణలో ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసుకుంటున్నమని ఈ సంవత్సరం దాదాపు 24 వరకు చేరుకున్నాం గతంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు సంఖ్య 26 చేరుకుంది వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు
నూతనంగా ప్రారంభించబోతున్నాం వీడికి కీప్యాడ్ ఆమోదం కూడా లభించిందని కెసిఆర్ తెలిపారు.
2014లో 2850 మెడికల్ సీట్లు ఉంటే 2023 నాటికి
8515 మెడికల్ సీట్లు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందులో 85 శాతం మెడికల్ కళాశాల సీట్లు తెలంగాణ బిడ్డకి దక్కాలని స్పష్టం చేశారు పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించాం
ఇది గొప్ప విజయం ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలల ద్వారా దేశానికే డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.


కరోనా టైంలో ఆక్సిజన్ చాలా అవసరం ఉండే దాని గుణపాఠంగా తీసుకొని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నేతత్వంలో 500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం 50 వేల పడకలను ఆక్సిజన్
బిట్స్ గా తీర్చిదిద్దుకుంటామని పదివేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ ఈరోజు ఒకేసారి 9 మెడికల్ కళాశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు కరీంనగర్ కామారెడ్డి ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి కొమరం భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ రాజన్న సిరిసిల్ల వికారాబాద్
జనగాం జిల్లాలో నేటి నుండి నూతన మెడికల్ కళాశాలలో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే సుదినం
ఒక రాష్ట్రంలో ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
ప్రారంభించడం దేశ వైద్య చరిత్రలోనే మొదటిసారి
ఇది సీఎం కేసీఆర్ పట్టుదల నిదర్శనం అన్నారు
రాష్ట్రంలో పేదలకు విద్య ‌వైద్య‌ అందుబాటులోకి రావాలని ఆయన మార్గం నిర్దేశం లో విజయాన్ని సాధించామన్నారు 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ ఒక కొత్త రికార్డు సృష్టించింది ఈ సంవత్సరమున రికార్డులు సృష్టించామన్నారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చి ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ వాటా 43% ఇది ఓ గొప్ప రికార్డు మిగతా27 రాష్ట్రాల్లో
కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 50% సీటు మాత్రమే అందుబాటులోకి వచ్చాయన్నారు.
రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి మంత్రి తారక రామారావు మాట్లాడుతూ కమిటీ మీటింగ్ కు
నిదర్శనం జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం.
వైద్య విద్య పటిష్టతతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి
ఓ కమిటీ మెంట్ కు నిదర్శనమని జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని అన్నారు. సిరిసిల్ల మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ సీఎం మెడికల్ కాలేజీలో ప్రారంభించి స్వరాష్ట్రం‌ ఏర్పాటైన వెంటనే
ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు ఏట 10 మంది విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకుని డాక్టర్లు గా బయటకు వస్తున్నారని చెప్పారు. దేశంలో 33 శాతం మంది వైద్య విద్యార్థులు ఒక తెలంగాణ రాష్ట్రం నుండి
వస్తున్నట్లు తెలిపారు 1993 లో నేను బయాలజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎంసెట్ రాస్తే 1600 ర్యాంకు వచ్చిందని అయినా మెడికల్ సీట్ రాలేదని మా అమ్మకు డాక్టర్ కావాలని మా నాన్నకు ఐఏఎస్ కావాలని ఉండేదన్నారు ఆ రెండు కాకుండా ప్రజా ప్రతినిధి అయ్యానని చెప్పారు.
ఇప్పుడు పదివేల ర్యాంకు వచ్చినా తెలంగాణలో మెడికల్ సీట్ వస్తుందన్నారు ఈ ప్రాంతంలో 2009 సంవత్సరంలో డిగ్రీ కాలేజ్ పంచాయతీ ఏర్పాటు ఉండేది సిరిసిల్లలో పెట్టాలని వేములవాడ పెట్టారని
డిమాండ్ వచ్చినప్పుడు ఈ రెండిటి మధ్య డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ వచ్చాక
మెడికల్ కళాశాల నర్సింగ్ కాలేజ్ జేఎన్టీయూ
వ్యవసాయ కళాశాల ఆక్వా హబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కొత్త మెడికల్ కాలేజీలో చేరే విద్యార్థులు ఆరు నెలలు ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్నా సహకరించాలని తెలిపారు రైతులు ప్రజలు ప్రాణాలు కాపాడే రక్షకులు అని వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే ప్రజలకు రైతులు దేవునితో సమానం అందుకే ప్రజలు ప్రాణాలు కాపాడే రక్షకుడు అని అంటారు వైద్యవృత్తిలో రాణిస్తూ తెలంగాణకు దేశానికి మంచి పేరు తేవాలని వైద్య విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా పరిషత్ చైర్మన్
అరుణ సెస్ చైర్మన్ చిక్కల రామారావు రాష్ట్ర పౌర్ణమి టెక్స్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ జెడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావు
రైతు పంది సమితి అధ్యక్షుడు గడ్డం నరసయ్య
మున్సిపల్ చైర్పర్సన్ ‌‌ జిందం కళా చక్రపాణి
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా అదనపు కలెక్టర్లు ‌ ఖీమ్యా నాయక్
గౌతమ్ రెడ్డి సిరిసిల్ల మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్
డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!