ఉంజుపల్లి ఎస్టి బాయ్స్ హాస్టల్లో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
నేటిదాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని ఉంజుపల్లి ఎస్టి బాయ్స్ హాస్టల్ లో కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిభిరం నిర్వహించి 60 మంది విద్యార్థులను పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ హాస్టల్ చుట్టుపక్కల నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని వేడి ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు
విద్యార్థులు పడుకునేటప్పుడు పూర్తిగా వస్త్రాలు ధరించాలని దోమలు కుట్టకుండా చూసుకోవాలని
జ్వరం వస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని వైద్యం తీసుకోవాలని అశ్రద్ధ చేయవద్దని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఉంజుపల్లి హాస్టల్ ప్రధానోపాధ్యాయుడు విఘ్నేశ్వరరావు సూపర్వైజర్ రాంప్రసాద్ ఉంజుపల్లి హాస్టల్ ఏఎన్ఎం మౌనిక పాల్గొన్నారు