నెక్కొండ ,నేటిధాత్రి:
మండలంలోని నాగారం గ్రామంలో శనివారం వైద్య శిబిరాన్ని వైద్య అధికారి సుధా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అలంకానిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఆధ్వర్యంలో ఏర్పాటుచేయగా శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సుదర్శన్ ప్రారంభించారు. అనంతరం పల్లె దవఖాన వైద్యాధికారిని డాక్టర్ సుధా ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిచేశారు మొత్తం 102 మందికి పరీక్షలు నిర్వహించగా అలాగే 32 మందికి డెంగ్యూ మలేరియా రక్త పూత నమూనాలు సేకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సిబ్బంది ఆశ కార్యకర్తలు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నందున ప్రజలు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజు, సిబ్బంది వినోద, ప్రవళిక, ఆశ కార్యకర్తలు అరుణ, కళ్యాణి ,తదితరులు పాల్గొన్నారు.