
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఆళ్లపల్లి మండల పరిధిలోని అనంతోగు పంచాయతీలో గల తిర్లాపురం గ్రామంలోని మొబైల్ టీం ప్రభుత్వ వైద్యులు కార్తీక్ ఆధ్వర్యంలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో మహిళలు,గర్భిణీలు, బాలింతలు,రైతులు,ప్రజలు ఎండల తీవ్రతకు గురి కావద్దని రక్షణ కవచంగా కాటన్ దుస్తులు ధరిస్తూ చల్లని ప్రదేశాల్లో ఉండాలని గొడుగులను వాడాలని మంచినీటిని వెంటనే ఉంచుకోవాలని వడదెబ్బలకు గురి కాకుండా తగు జాగ్రత్తలను సూచనలు పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. వేసవిలో చిన్నారి పిల్లలను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్ళనీయకూడదని వ్యవసాయ కూలీలు రైతులు గ్రామీణ ఉపాధి కూలీలు ఎండల్లో అధికంగా పని చేయకూడదని సూచించారు.ఏది ఏమైనప్పటికీ గ్రామంలోని ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలను సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ సరిత,ఆశావర్కర్ కావేరి, పాయం వీరమ్మ,ఈసం బుచ్చమ్మ,కుమారి, బాయమ్మ, భాగ్యలక్ష్మి,ఉషారాణి,ఆదమ్మ,వెంకటలక్ష్మి,సౌజన్య, పుసం లక్ష్మి,జోగా లక్ష్మి,పాయం యార్రమ్మ, పుసం రజిత,వజ్జ మమత, గ్రామస్తులు పాయం సూరయ్య, పుసం సూరయ్య,సమ్మయ్య,నాగేష్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.