
TUDA Chairman Hails Journalists as True Workers of Society
*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..
*కుటుంబాన్ని పక్కనబెట్టి సమాజం కోసం కృషి చేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులు..
*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
10:
వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, పక్కనబెట్టి సమాజ శ్రేయస్సు తమ కర్తవ్యం గా భావించి పనిచేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులని తుడా చైర్మన్, టిటిడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ఆధునికరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో తిరుపతి ప్రెస్ క్లబ్ ను ఆధునికరించడం సంతోషంగా ఉందన్నారు. మొదటినుంచి మీడియా మిత్రులు తన సోదరులుగా భావించి వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్నానని ఇకపై కూడా వారితో కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరచడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. యువత చెడుదారి పట్టుకున్న వారిని మంచి మార్గంలో నడిపే బాధ్యతను మంచి కథనలతో మీడియా తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను అన్నిరంగల్లో భారత దేశంలో మొదటి స్థానంలో నిలపడానికి మీడియా కృషి చేయాలని సూచించారు. తిరుపతి మీడియా మిత్రులకు ప్రెస్ క్లబ్ కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు,
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు..