కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికపుడు మీడియా కేంద్రం ద్వారా ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార మాధ్యమాలకు అందచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికలు నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అమలులో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలు,వాణిష్య ప్రకటనలు, సిటి కేబుల్లో ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలు ఇతరత్రా ప్రకటనలకు తప్పని సరిగా మీడియా సెంటర్ ద్వారా ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని చెప్పారు. మెటీరియల్ ముద్రణలో ప్రచురణకర్త పేరు, సెల్ నెంబరు, ప్రింటింగ్ ప్రెస్ చిరునామాతో మూడు ప్రతులను అందచేయాలని,
పరిశీలన తదుపరి అనుమతులు జారీ చేయనున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాలు, ప్రింటు, ఎలక్ట్రానిక్
మీడియాలలో వచ్చే పెయిడ్ న్యూస్ ను పరిశీలించి వ్యయాన్ని లెక్కించి సంబంధిత అభ్యర్థుల ఖర్చుకు
జమచేయనున్నట్లు చెప్పారు. పెయిడ్యూస్ తదితర అంశాలపై ఖర్చుల వివరాలను వ్యయ పరిశీలన
బృంధానికి అందచేయాలని చెప్పారు. ఎన్నికల సంబంధిత ప్రకటనలు ప్రచారాలపై గట్టి నిఘా పెట్టాలన్నారు.ప్రకటన, ప్రచారానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఖర్చు విషయమై రేట్ కార్డు ప్రకారం ఎప్పటికప్పుడు సంబంధిత పార్టీ అభ్యర్థుల ఖర్చులో పొందుపర్చే విధంగా వ్యయ పరిశీలకునికి సమర్పించాలన్నారు.ఎన్నికల విధులు అత్యంత కీలకమయినవని, సమర్థవంతంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎస్.శ్రీనివాసరావు,ఎంసిఎంసి కమిటీ సభ్యులు శ్రీనివాసన్, జునుమాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.