Medak Church Thrilled with Devotees and Leaders
నాయకులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
◆-: బోరేగావ్ సర్పంచ్ నాగేందర్ పటేల్ పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగాణమంత కిటకిటలాడింది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూల గెలిచిన సర్పంచ్లు పాటు పొరుగు ఝరాసంగం మండల బోరేగావ్ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ విజయం సాధించిన తరువాత తమ కార్యకర్తలతో భక్తులతో, పర్యాటించి తరలి రావడంతో చర్చి ప్రాంగాణమంత కిటకిటలాడింది. భక్తులు మరియు నాయకులు ప్రార్థనల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా
బోరేగావ్ పాస్టర్ భక్తులనుద్దేశించి దైవసందేశం చేశారు.ప్రభువైన యేసు అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ లోక రక్షకుడిగా ఉండి పరలోకం నుంచే తన దీవెనలను అందిస్తాడన్నారు. నమ్ముకున్న వారి గుండెల్లో దైవ సహాయకుడిగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన యేసయ్య భక్తి గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రామ్ చందర్, సిద్ధప్ప, రాజు, శేఖర్,తదితరులు పాల్గొన్నారు.
