కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
కేసముద్రం మండలం వ్యవసాయ మార్కెట్ సెంటర్లో ఎం సి పి ఐ యు, ఏఐసిటియు ఆధ్వర్యంలో కేసముద్రం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో దోమల మందు పిచికారి చేయాలని ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఎం సి పి ఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న,ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు జాటోత్ బిచ్చ నాయక్ లు మాట్లాడుతూ ప్రజలు దోమల బారినపడి అనేక రకాల వ్యాధులకు గురిఅవుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఇది సమంజసం కాదని వారు అన్నారు.ఇప్పటికైనా మండలంలోని అన్ని గ్రామాలలో దోమల నివారణ మందును పిచికారి చేయించాలని వారు అన్నారు.లేనియెడల దశల వారి పోరాటాలు చేపడతామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బానోత్ ఈసు,బానోత్ శీను,పత్తి బాల వెంకటేష్,బానోత్ సూర్య నాయక్,బి.రాజు తదితరులు పాల్గొన్నారు.