
agricultural sector
కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…
కోతుల బెడద వల్ల వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది…
రోడ్లపైకి వెళ్ళుటకు జంకుతున్న ప్రజలు…
పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్న విద్యార్థులు…
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి.
మండల వ్యాప్తంగా కోతులు జనవాసాలలోకి గుంపులు, గుంపులుగా ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది.ఆకలితో అలమటిస్తూ,అడవులను వదిలేసి గ్రామాల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి.కోతుల దాడులలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.గ్రామాల్లో ఇంటి తలుపులు వేయడం మర్చిపోతే ఇక అంతే సంగతులు కోతులు ఇంట్లోకి ప్రవేశించి వంట సామాగ్రి, దుస్తులు,ఆహార పదార్థాలు చిందర-వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. తమ అవసరాల కోసం ప్రజలు రోడ్లపైకి వెళ్లడానికి జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.వసతి గృహాలలో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు కోతుల బారినపడి గాయాలైన సందర్భాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద వల్ల మండల వ్యాప్తంగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది. కోతులు ఆగం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు.