
Agricultural Sector
కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి…
కోతుల బెడద వల్ల వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది…
రోడ్లపైకి వెళ్ళుటకు జంకుతున్న ప్రజలు…
పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్న విద్యార్థులు…
కోతులకు ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని కోరుతున్న ప్రజలు…
రాష్ట్రపతి ద్రౌపది మూర్ముకు లేక రాసిన సామాజికవేత్త కందునూరి ఈశ్వర్ లింగం…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-
గార్ల మండల వ్యాప్తంగా 20 గ్రామపంచాయతీలతో పాటు,ముఖ్యంగా గార్ల పట్టణ కేంద్రంలో కోతులు జనవాసాలలోకి గుంపులు, గుంపులుగా ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది.ఆకలితో అలమటిస్తూ,అడవులను వదిలేసి గ్రామాల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి.కోతుల దాడులలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.గ్రామాల్లో ఇంటి తలుపులు వేయడం మర్చిపోతే ఇక అంతే సంగతులు కోతులు ఇంట్లోకి ప్రవేశించి వంట సామాగ్రి, దుస్తులు,ఆహార పదార్థాలు చిందర-వందర చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. తమ అవసరాల కోసం ప్రజలు రోడ్లపైకి వెళ్లడానికి జంకుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.వసతి గృహాలలో ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు కోతుల బారినపడి గాయాలైన సందర్భాలు కో కొల్లలుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద వల్ల మండల వ్యాప్తంగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణ లేకుండా పోయింది. పండించిన పంటను చేతికొచ్చే సమయంలో కోతులు ఆగం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులకు ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని ప్రజలు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.ఇప్పటికే కోతుల నివారణ చర్యలు చేపట్టాలని సామాజికవేత్త రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు లేఖ రాశారు. రాష్ట్రపతి కార్యాలయానికి ఈశ్వర్ లింగం రాసిన లేక అందినట్లు తనకు లేఖ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.అనేక దఫాలుగా కోతుల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరినప్పటికీ సమస్య పరిష్కారానికి కృషి చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా కోతుల నివారణ చర్యలు చేపట్టాలని విద్యార్థులు,విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.