నేటిధాత్రి, వరంగల్
హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో జరిగింది. హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ కమిటీని
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి.ఎన్.జి.ఓ హనుమకొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎండీ మహబూబ్ ఎన్నికయ్యారు. మహబూబ్ కు జాయింట్ సెక్రటరీ పోస్ట్ రావడంతో హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ ప్రెసిడెంట్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో మహబూబ్ కి సన్మానం చేశారు. తనకు జాయింట్ సెక్రెటరీ ఇచ్చినందుకు మహబూబ్ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.