MD Iliyas Appointed PRP Minority Wing President
పిఆర్పి మంచిర్యాల మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ ఇలియాస్
మంచిర్యాల,నేటి ధాత్రి:
రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులుగా ఎం.డి.ఇలియాస్ ను నియమించారు.జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మనీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అనంతరం ఇలియాస్ మాట్లాడుతూ..నాపై నమ్మకంతో అప్పజెప్పిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీ అభ్యుదయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ అవకాశాన్ని కల్పించినందుకు
తీన్మార్ మల్లన్నకి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ కి,జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి కృషి చేసి,మైనారిటీల సమస్యలు పరిష్కారం దిశగా పని చేస్తానని తెలపడం జరిగింది.వచ్చేది బీసీల రాజ్యమే అని మైనారిటీలు అందరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పై తీన్మార్ మల్లన్న సారధ్యంలో మన రాజ్యాధికారం వస్తుందని విశ్వసిస్తున్నారని తెలిపారు.అనంతరం ఎం.డి.ఇలియాస్ ని శాలువాతో సత్కరించి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు.
