కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతేనే దోపిడి విముక్తికి మార్గం
మోడీ విధానాలు దేశానికి అత్యంత ప్రమాదకరం
ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్
నర్సంపేటలో ఎంసీపీఐ(యు) భారీ ప్రదర్శన -బహిరంగ సభ
ఆకట్టుకున్న కళారూపాలు, పాటలు
నర్సంపేట,నేటిధాత్రి:
దేశంలో పెరిగిపోతున్న దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఎంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, పోలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ (యు) వ్యవస్థాపకులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా నర్సంపేటలోని నెక్కొండ రోడ్డు సర్కిల్ నుంచి సిటిజన్ క్లబ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ ముందు కోలాటాలు డప్పు బృందం కళాకారుల ఆటపాటలు ఎంతో ఆకట్టుకున్నాయి.
అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ముఖ్య అతిధులుగా హాజరైనా మద్దికాయల అశోక్ ఓంకార్, కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ దేశంలో మోడీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని ఈ క్రమంలో మత వైరుధ్యాలు నియంతృత్వాన్ని పెంచి పోషిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమిస్తే తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. ఆ దిశలో వర్గ సామాజిక పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.అరుణోదయ విమలక్క, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపెళ్లి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఎస్ యు సి ఐ రాష్ట్ర నాయకులు గంగాధర్ లు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడని చట్టసభలకు వన్నె తెచ్చాడని రాజకీయ విలువలకు ఆదర్శాలకు త్యాగాలకు నిలువుటద్దంగా నిలిచాడని ఆయన కోరుకున్నట్లు లాల్ నీల్ ఐక్యతను పెంపొందించాలని ఆయన ఆశయ సాధనలో అంతరాలు లేని సమాజ స్థాపనకు చేయాలని పిలుపునిచ్చారు.
ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను పాఠ్యాంశంలో చేర్చి వారి గుర్తుగా స్మారక చిహ్నాలు మ్యూజియం ఏర్పాటు చేయాలని, కామ్రేడ్ ఓంకార్ పేరుతో నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి, స్టేడియంకు నర్సంపేట నుంచి వరంగల్ ప్రధాన రహదారికి నామకరణం చేయాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాంస్య విగ్రహాలు పెట్టించాలని విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి వనం సుధాకర్ కుంభం సుకన్య గోనె కుమారస్వామి వస్కుల మట్టయ్య వరికుప్పల వెంకన్న ఎన్ రెడ్డి హంసరెడ్డి కన్నం వెంకన్న మంద రవి ఎస్.కె నజీర్ తుకారాం నాయక్ గేయ రచయిత యోచన రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ కుసుంబా బాబురావు నర్ర ప్రతాప్ కనకం సంధ్య గుండెబోయిన చంద్రయ్య మైదం శెట్టి రమేష్ తుడుం అనిల్ కుమార్ కంచ వెంకన్న మాలోతు జబ్బర్ నాయక్ కర్రోళ్ల శ్రీనివాస్ తాండ్ర కళావతి నీల రవీందర్ కర్ర రాజిరెడ్డి గడ్డం నాగార్జున పల్లె మురళి మాస్ సావిత్రి మహమ్మద్ రాజా సాహెబ్ మాలోతు సాగర్ కొత్తకొండ రాజమౌళి మాలి బాబురావు ముక్కేర రామస్వామి కేశెట్టి సదానందం సింగతి మల్లికార్జున్ జన్ను రమేష్ వందలాదిమంది కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
