పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం
పరకాల,నేటిధాత్రి
మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు.45 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో నిరుద్యోగ మహిళలు,యువతులకు ఆధునిక కుట్టుపనిపై ఉచితంగా శిక్షణ అందించనున్నారు.శిక్షణ అనంతరం అర్హులకు ఉచిత కుట్టుమిషన్లు,సర్టిఫికెట్లు అందజేస్తామని నిర్వాహకులు కొక్కిరాల రాకేష్ రావు,చందా కుమారస్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి,కౌన్సిలర్ దుబాసివెంకటస్వామి,కొక్కిరాల దీప్తి, గందె వెంకటేశ్వర్లు,పంచగిరి శ్రీనివాస్,భగవాన్ రెడ్డి,ఇంగిలి వీరేష్ రావు,పిట్ట స్వప్న దేవేందర్,గంట కళావతి,దగ్గు సునీత,బండి వెంకటేష్, సాంబరాజు జ్యోతి,ఏకు రమేష్,బియాబాని,బొచ్చు వాసు,మక్సుద్,నాగరాజు,కోటి,సునీల్,ఆకాష్,అంబిర ఉమ,గందె అనిత,ఫౌండేషన్ సభ్యులు,శిక్షకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
