ఎంబిబిఎస్ విద్యార్థిని సన్మానించిన నవ చైతన్య యువజన సంఘం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం పాలగూడెం గ్రామానికి చెందిన వజ్జ వీర కుమారి వైద్య విద్య ఎంబిబిఎస్ లో సీటు సంపాదించడం గర్వకారణమని పట్టుదలతో చదివి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని వక్తలు ఆకాంక్షించారు. ఎంబిబిఎస్ పూర్తయ్యే వరకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతమైన గుండాల మండలంలో యువత నైపుణ్యాన్ని వెలికితీయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,యూత్ ఇల్లందుల నరసింహులు, గడ్డం లాలయ్య, అజ్జు,కందుకూరి సంతోష్, సతీష్, సునీల్,వినయ్,సతీష్, ప్రశాంత్, మహేష్,ఆజాద్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!