వసతిగృహాలకు మేస్ కాస్మోటిక్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు

భూపాలపల్లి నేటిధాత్రి

ఈనెల 29వ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే చలో కలెక్టరేట్ విద్యరంగ సమస్యల పై పరిష్కారానికి ముట్టడిని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు అన్నారు శనివారం రోజున కారల్ మార్క్స్ కాలనీలోని లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 5 700 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు సరిగా స్కాలర్షిప్స్ రావడం లేదన్నారు అలాగే ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపా లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థులకు మెస్ కాస్మోటికు చార్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలన్నారు అంతే కాకుండా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు చేసింది ఏం లేదన్నారు విద్య రంగ సమస్యలను పరిష్కరించడంలో అప్పుడు ఉన్నటువంటి కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగ సమస్యల పైన దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించలన్నారు లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సమావేశం సందర్భంగా హెచ్చరించడం జరిగింది
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కోటేష్ విష్ణు అదేవిధంగా ఎస్సీ బాయ్స్ ఎస్ఎంఎస్ హాస్టల్ కమిటీ సభ్యులు వంశీ శ్రీకృష్ణ శేఖర్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!