Congress MLA urges voters to support village development
అభివృద్ధి చూసి ఆశీర్వదించండి ఎమ్మెల్యే
నడికూడ,నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, వెంకటేశ్వర్ల పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలి అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
నడికూడ మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుకల అంజిరెడ్డి మరియు వార్డ్ మెంబర్ల గెలుపు కోసం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటా ప్రచారంని నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటేశ్వర్ల పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుకల అంజి రెడ్డి ఉంగరం గుర్తు మరియు వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ప్రజలే మా పాలకులని,ప్రజల మేరకే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని,గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి ముసుగులో దోచుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వా లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.గెలిచి వచ్చిన వారి గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చే బాధ్యత తనదనీ అన్నారు.సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు,మహిళలకు ఉచిత బస్సు,500లకే గ్యాస్,సన్న బియ్యం,ఇందిరమ్మ ఇళ్లు, రెండు లక్షల రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్, రేషన్ కార్డులు,200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు.పార్టీలకు అధికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
