
Durga Mata Blessings for All
దుర్గా మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
దుర్గా మాత చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. (శనివారం)భూపాలపల్లి పట్టణంలోని కేటీకే – 1 ఇంక్లైన్ కేటీకే OC- 2 ప్రాజెక్టు ఆలయాల్లో జరిగిన దుర్గా మాత పూజల్లో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. దుర్గా మాత చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే దుర్గా దేవీని వేడుకున్నారు. ఈ కార్యక్రమాలల్లో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు