ఘనంగా ఆర్కేపి లో “మే” డే వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలో 139వ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.చారిత్రాత్మక మేడే ఆవిర్భావ నేపథ్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకుని వారి త్యాగాలకు పలువురు కార్మిక సంఘ నాయకులు, రాజకీయ నాయకులు ఘన నివాళులర్పించారు. సిపిఐ కార్యాలయం ఆవరణలో అక్బర్ ఆలీ, సిహెచ్పి సమీపంలో ఏఐటియుసి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో తేజావత్ రాంబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, సీఐటియు కార్యాలయం ఆవరణలో పార్టీ నాయకులు సాంబారి వెంకటస్వామి, రామగిరి రామస్వామి, రజక సంఘం కార్యాలయం ఆవరణలో అధ్యక్షుడు నడిగోట తిరుపతి , సింగరేణి సివిల్ కార్యాలయం సమీపం లో ఐఎన్టీయుసి నాయకులు సంగ బుచ్చయ్య, శ్రీనివాస్ గౌడ్, మేకల రాజయ్య,కాంగ్రెస్ నాయకులు యాకుబ్ ఆలీ, తాపీ మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు జిలకర రాయమల్లు లు జెండాలు ఎగరవేసి మే డే దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.