
-ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
వనదేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మ దేవతల ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి ఆ దేవతలను వేడుకున్నట్లు తెలిపారు. బుధవారం ముల్కలపల్లి-మొగలపల్లి గ్రామాల మధ్యన నిర్వహిస్తున్నటువంటి శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఆయన శ్రీ సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని..పాలకాయ కొట్టి..మొక్కులను సమర్పించుకున్నారు. ఆయన వెంట సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, జడ్పిటిసి జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.