-మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
ఆ దేవదేవుడు శివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్నోకాలను ఏలే ఆ శివుడి ఆశీస్సులతో ప్రజలు పాడిపంటలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లాలని వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.