మౌలానా జీవిత చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్పించాలి

నర్సంపేట,నేటిధాత్రి :

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, స్వతంత్ర సమరయోధులు భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్పించాలని తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ అన్నారు
ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జావీద్
మాట్లాడుతూ మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేవని అన్నారు.జాతీయ అక్షరాస్యత దిన సందర్భంగా ఎస్టి,ఎస్సీ,బీసీ, మైనార్టీ విద్యార్థినులకు ఉచిత విద్య అందించాలని అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం,ఉద్యోగ జీవనోపాధి కల్పించాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు శాశ్వత భవనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *