చిన్నదర్పల్లిలో విద్యార్థులకు మెటీరియల్ అందజేత.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
భవిష్యత్తు బాగుండాలంటే మంచిగా చదువుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 15, చిన్న దర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ కేవలం మన మహబూబ్ నగర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను మరోసారి రివిజన్ చేయాలని చెప్పారు. మీరంతా ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని అక్కడ సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారని, ఇంటర్మీడియట్ తో పాటుగా ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోసం తన సొంత నిధులతో ఉచితంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం 200 మంది విద్యార్థులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామని, మీరు ఇంటర్మీడియట్ ప్రభుత్వం కళాశాలలో చేరితే మీ తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారం తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ బాలు యాదవ్, ప్రధానోపాధ్యాయులు శైలజ, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు లక్ష్మణ్ నాయక్, రమేష్ నాయక్, యాదయ్య యాదవ్, యం. నాగరాజు యాదవ్, రమేష్ యాదవ్, రవి నాయక్, యాదగిరి నాయక్, ఆంజనేయులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.