నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నల్లబెల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో మాత రామాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ హాజరై, రామా బాయ్ యొక్క చిత్రపటానికి పూలమాలవేసిన అనంతరం మాట్లాడుతూ, దళిత జాతిలో వెలుగులు నింపడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషికి వెండి దన్నుగా నిలిచి, దళిత జాతి ఔన్నత్యం కోసం పాటుపడిన మహిళగా మాత రామాబాయి సేవలు మరువలేనివి అని అన్నారు. ప్రతి ఒక్కరూ మాత రామబాయిని ఆదర్శంగా తీసుకొని భారత జాతి అనుమత్యానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మహిళా జాతికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బన్నా ప్రభాకర్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి భాకం హరిశంకర్, భాజపా నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లిగంటి నర్సింగ్గం, జిల్లా ఉపాధ్యక్షులు దండు చక్రపాణి, ఇల్లందుల కిషన్, మోకిడే ప్రభాకర్, వల్లే రమేష్ , రఫీ, శ్రీకాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు