
నర్సంపేటలో భారీఎత్తున కార్మిక సంఘాల ర్యాలీ.
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి
అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
నర్సంపేట,నేటిధాత్రి:
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నర్సంపేట పట్టణంలో ఆల్ ట్రేడ్ యూనియన్, సిఐటియు, బిఆర్టియు ఎఐటియుసి,ఏఐఎఫ్టియున్యూ, ఐఎఫ్టియు, టియుసిఐ సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు కూడలి నుండి జయలక్ష్మి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడం మల్లేశం, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఇసంపెల్లి బాబు, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి గుంపెల్లి మునీశ్వర్,సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పంజాల రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదన్నారు.రోజుకు ఎనిమిది గంటల పని విధానానికి స్వస్తి పలికి 10 గంటలు పని చేయాలని చెప్పడం కార్మిక వర్గాన్ని శ్రమదోపిడికి గురి చేయడమని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని రైతులపై బలవంతంగా రుద్దుతున్న నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సమ్మెకు మద్దతుగా సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతు తెలిపి ప్రదర్శనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ,ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గడ్డం సమ్మయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు హనుమకొండ శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బాలకృష్ణ,సిఐటియు పట్టణ కార్యదర్శి రాజు, మున్సిపల్ యూనియన్ యశోద,ఆశా యూనియన్ సుజాత, ఏఎఫ్టీయు నాయకులు జనార్ధన్ రమేష్,ఏఐటీయూసీ నాయకులు గోవర్ధన చారి, ఎడ్ల నాగులు, కొత్తగట్టు నరసింహం, కిషోర్, కనకమల్లు, సిపిఐ కార్యవర్గ సభ్యుడు అక్క పెళ్లి రమేష్, ఐ ఎఫ్ టి యు నాయకులు సుమన్ మొగిలి బాలు కృష్ణ మల్లయ్య స్వరూప పివైఎల్ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి,టియుసిఐ జిల్లా కార్యదర్శి అడ్డురి రాజు,జిల్లా నాయకులు కట్టన్న తదితరులు పాల్గొన్నారు.