నడి కూడ,నేటి ధాత్రి:
ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, బిజెపి నాయకులు చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామం నుండి కాంగ్రెస్,బిజెపి పార్టీలకు చెందిన యువ నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు,బిజెపి మత రాజకీయాలు నచ్చకనే ఆ పార్టీలను వీడుతున్నారన్నారు.బి.ఆర్.ఎస్.ప్రభుత్వం తోనే యువతకు బంగారు భవిష్యత్ ఉంటుందని బి.ఆర్.ఎస్.గెలుపుకోసం యువత ముందుండాలని కోరారు.
పార్టీలో చేరినవారిలో జమలపురం కర్నాకర్, కోడెం రాకేష్, తంగెళ్ళ ప్రియతం రెడ్డి,తాల్లపెల్లి సాయికృష్ణ,బండి అజయ్,కిన్నెర రాజుకుమార్, పుస్కూరి రామోజీ,పాడి వంశీకృష్ణ, బాషబోయిన రోహిత్,వరికెల సాయికృష్ణ,సిట్టే శంకర్ రావు,నాగుర్ల వెంకటేష్, ఇట్టబొయిన అజయ్, మోడే నితీష్, గోరింటల అభిలాష్, కొడెం సృజన్, సూదుల సాయిచరన్, కొడెమ్ ప్రణీత్,బాణాల ప్రణయ్, కొడేం శ్రీరామ్,జుక్కజువ్వ తిరుపతి,రవి లతో పాటు 50మందికి పైగా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి,మండల నాయకులు నందికొండ గణపతి రెడ్డి,నందికొండ జైపాల్ రెడ్డి, సర్పంచ్ తిప్పర్తి సాంబశివ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు కొడేపాక కుమారస్వామి,
గ్రామ అధ్యక్షులు తాల్లపెళ్ళి రమేష్,నాయకులు పాడి చంద్రారెడ్డి,వర్ణం శ్రీధర్ రెడ్డి,తాళ్లపెల్లి రవీందర్,వర్ణం సునీల్ తదితరులు పాల్గొన్నారు.