నేటి ధాత్రి జైపూర్ :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట, మిట్టపల్లి, రసూల్ పల్లి, నర్వ , టేకుమట్ల బెజ్జాల గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీని వీడి సోమవారం రోజున చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే వివేక్ అందరికీ కండువాలు కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఇంతమంది పార్టీలోకి చేరడం చాలా సంతోషకరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త శ్రేయస్సు కోరుకుంటుందని, అమ్మలా ఆదరిస్తుందని, పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ముందుకు సాగాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా మారుతుందని తెలిపారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడపడానికి నా సాయ శక్తుల కృషి చేస్తానని, ఎటువంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరగా పరిష్కారాన్ని చూపిస్తామని తెలియజేశారు. పార్టీలోకి చేరిన నూతన కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.