
#ప్రధాని మోడీ ప్రభుత్వంలో… దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు.
#అమలు కానీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో పేద,మధ్యతరగతి ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నర్సంపేట నియోజకవర్గంలో యువత పెద్దఎత్తున బీజేపీ పార్టీలో చేరుతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రంగాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు 20మంది బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశ ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్న బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో అమలు కానీ హామీలతో అధికారం చేపట్టి సంవత్సరం దాటుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయకుండా పబ్బం గడుపుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాల్లో నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న పథకాలే ఎక్కువగా ప్రజలకు చేరువయ్యాని,మోడీ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని,కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తల పై ఉందన్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీజేపీ పార్టీ యువతకు పెద్దపీట వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తుందని కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శులు బచ్చు వెంకటేశ్వర్ రావు,తడుక వినయ్ గౌడ్, నాయకులు వల్లే పార్వతలు, బోట్ల ప్రతాప్,గుర్రపు నరేష్, బల్ల రాజు,ఊటుకూరి చిరంజీవి, గుగులోతు తిరుపతి,దికొండ సునీల్,గుగులోతు రాందాన్,రాజేందర్,భగవాన్ తదితరులు పాల్గొన్నారు.