తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం కస్పే కట్కూరు గ్రామం నుండి బీఎస్పీ నాయకులు కార్యకర్తలు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ప్రజల అవసరాలను గుర్తించి అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని పార్టీకి సంబంధించిన అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని ఇది ప్రజల పార్టీ అని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజేందర్రావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి అభ్యర్థించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఎస్పీ నాయకులు బెల్లి కనకరాజు ఐ ఎఫ్ టి సి బందెల మధు రాజు అన్వేష్ సుధాకర్ స్వరూప ఝాన్సీ గణేష్ మధు రాజు అఖిలేష్ ఇట్టి చేరికల కార్యక్రమంలో పొన్నం లక్ష్మణ్ గౌడ్, జూపల్లి రాజేశ్వరరావు బొమ్మ వరం దేవేందర్ రావు సాయి తదితరులు పాల్గొన్నారు