ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాగృతి కృషి చేస్తుంది.
కలువల ప్రాజెక్టు పునఃనిర్మాణం కోసం జాగృతి పోరాటం చేస్తుంది.
జాగృతిని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తాం.
గుంజపడుగు హరిప్రసాద్
జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జాగృతి.
“నేటిధాత్రి”, శంకరపట్నం.
ఈరోజు శంకరపట్నం మండలంలో జాగృతి సీనియర్ నాయకురాలు ఎండి సల్మా గారి ఆధ్వర్యంలో జాగృతిలోకి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చింతిరెడ్డి జైపాల్ రెడ్డి తోపాటు సోహెల్, విష్ణువర్ధన్, మహిళ నాయకురాలు సానియా, నాజీయా, అజీత్ సోని లతో పాటు 50 మంది మహిళలలు ఈరోజు జాగృతి లో చేరడం జరిగింది వారికి జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ జాగృతి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడం జరుగుతుందని 2029 వరకు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే విధంగా జాగృతిని అన్ని విధాలుగా బలోపేతం చేస్తామని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మరియు ప్రతిపక్షం రెండు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందాయని కవితక్క నాయకత్వంలో జాగృతి ఒకటే గత రెండు సంవత్సరాలగా ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తుందని వారు అన్నారు. జాగృతి ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం దొరుకుతుందని ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువకులు జాగృతి అధ్యక్షురాలు కవితక్క వైపు ఆశాతో ఎదురు చూస్తున్నారని శంకరపట్నం మండలంలో కలువల ప్రాజెక్టు పునర్నిర్మానం జరిగేంత వరకు జాగృతి పోరాటం చేస్తుందని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జాగృతి ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, మండల ఇంచార్జ్ చంటి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్ గాలిపల్లి రత్నాకర్ చారి, జంగ అపర్ణ, తదితరులు పాల్గొన్నారు.
