
జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో హుజురాబాద్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. కోరపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో హుజురాబాద్ ఐసిడిఎస్ సి డి పి ఓ సుగుణ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతలతో పాటు అన్నప్రాసనం అక్షరాభ్యసత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సుగుణ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం తో పాటు తగు జాగ్రత్తలను సూచించారు. జమ్మికుంట ఎంపీడీవో భీమేష్ వావిలాల హెల్త్ సూపర్వైజర్ మోహన్ రెడ్డి ,కెవికె శాస్త్రవేత్త ప్రశాంతి లు మాట్లాడుతూ అంగన్వాడి లు ఇచ్చే ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు అన్నప్రాసన అక్షరాభ్యాసత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సివైద్యులు బిందు ,అంగన్వాడీ టీచర్లు ,ఏఎన్ఎంలు ,హై స్కూల్ ప్రిన్సిపల్ సమ్మయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.