నియోజకవర్గంలో పెరుగుతున్న అసమతి వర్గం.
రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పార్టీ.
ఉమ్మడి మండలంలో అధికార పార్టీకి జోరుగా వలసలు.
రామాయంపేట (మెదక్)నెటి ధాత్రి.
రామయంపేట మండలంలో మరియు మెదక్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుండి అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి ఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే అది తరహాలో పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికార పార్టీలో చేరడం జరుగుతుంది. రామయంపేట పట్టనానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు దోమకొండ వెంకటేష్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం జరిగింది. దోమకొండ వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ వార్డు సభ్యునిగా, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా,మరియు మహంకాళి దేవస్థానం డైరెక్టర్ గా కొనసాగడం జరిగిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నామన్నారు. రామంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక యువజన సంఘం నాయకులు అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో అధికార పార్టీలో చేరుతున్నట్లు పలువురు తెలుపుతున్నారు.