నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)
బడిబాటలో భాగంగా శుక్రవారం రోజున మండల కేంద్రం కమలాపూర్ లోనిఎంపీపీఎస్ టాకీస్ ఏరియా పాఠశాలలో నూతనంగా ఒకటవ తరగతి లో నమోదు కాబడిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యములో నిర్వహించారు…
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడబ్ల్యుసి పవన్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో నమోదు కావాలని, ఆ దిశగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు అధ్యక్షురాలు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఏపిసి చైర్పర్సన్ మండ కళ్యాణి మండ కుమార్ అంగన్వాడి టీచర్ పద్మకుమారి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు…