
వీణవంక,( కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని చల్లూర్ గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వర్కిం గోగ్ ప్రెసిడెంట్గా ఇటివల్ల నియామకమైన మొహమ్మద్ సజ్జద్ ను శుక్రవారం వీణవంక మండలంలోని చల్లూరు, గ్రామ మైనార్టీ సోదరులు పూలమాల శాలువాలతోఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ కష్టపడ్డా కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిస్తుంది అనడంలో నిదర్శనం సజ్జద్ అని, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది మైనారిటీలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఖుబా మస్జిద్ సదర్ సాహబ్ ఎండి ఖమ్రొద్దీన్, జామా మస్జిద్ సదర్ సాహబ్ ఎండి జాఫర్ సాహబ్ , ఇమామ్లు
ముఫ్తి జుబెయిర్ అన్సారి, మౌశీన్ ఆలం, మునిరుద్దీన్, ముస్తాక్ అహ్మద్, మస్జిద్ కమిటీ సభ్యులు ముస్తాక్, నకియుద్దీన్, జీలానీ, ఫకీర్ పాషా, సోహెల్, రషీద్ బాబా, జావీద్ , దౌలత్, రఫీక్ , తౌసిఫ్, ఫెరోస్, షాబుద్దీన్ , సైదుల్లా, మథిన్, ఆఖిల్ పాషా, నిస్సార్, జమీల్, మౌసీన్ , ఆజం తదితరులు ఘనంగా సన్మానించడం జరిగినది.