ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి
కాప్రా నేటిధాత్రి 23:
మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని న్యూ నరసింహనగర్ కాలనీలో ఉన్న మసీదు ఏ అలీ అబు తాలిబ్ యొక్క నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అవసరమైన తోడ్పాటు అందిస్తూ మసీదు యొక్క నూతన భవన నిర్మాణానికి పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి ఆటంకాలు రాకుండా ఈ యొక్క మసీదు నిర్మాణం పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయిజెన్ శేఖర్, గంధం నాగేశ్వరరావు, ముస్లిం సోదరులు వాషింగ్ ఖాన్ ఇమామ్, ముస్తఫా మజాయిన్, హనీఫ్, ఎండి రిజ్వాన్, ఎండి జావీద్, ముజాహిద్ నవాజ్, కబీర్ భాయ్, సయ్యద్ సబేర్, అబ్దుల్ వాహీద్, నిసార్ అహ్మద్ గోర, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.