
President Upender Madiga
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి
ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ మాదిగ
పరకాల నేటిధాత్రి
ఆగస్టు 20న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయుకుడు,మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్.పిడమర్తి రవి నాయకత్వంలో పానీ పూరీ గో బ్యాక్ అనే నినాదంతో రాష్ట్రం లో మరో తెలంగాణ ఆస్తిత్వ ఉద్యమ ఆవిర్భావ సభ జరుగుతుందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బతుకు దెరువుకోసం తెలంగాణకు వచ్చి ఆర్ధిక పరిపుష్టి సాధించి, బరితెగించి దాడులకు దిగుతున్న ఉత్తరాది మార్వాడీల పెత్తనాన్ని ప్రశ్నిస్తూ,జరుగుతున్న ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలో నీ అన్ని జిల్లాలో ఉన్న తెలంగాణ వర్తక సంఘం మరియు స్థానిక వ్యాపారులు,ప్రజా సంఘాల నాయుకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మైస ఉపేందర్ మాదిగ తెలిపారు.