ఉద్యోగం ఒకచోట నివాసం మరోచోట
సమయపాలనకు చమర గీతం పాడుతున్న కార్యదర్శులు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
మండలంలోని పలు పంచాయతీ కార్యదర్శులు కొందరు సమయపాలన పాటించడం లేదని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి కొందరు మణుగూరు పినపాక బయ్యారం, తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడంతో పంచాయితీ అభివృద్ధి పథకంలో కుంటుపడుతున్నాయని ఆయా గ్రామ ప్రజలు వాపోతున్నారు. పలు గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం ఇక్కడ నివాసం మరోచోట దూర ప్రాంతమైన ఉదయం 10 దాటితే కానీ కార్యాలయాలకు రాలేకపోతున్నారు మరియు మరల రెండు గంటలు కాకముందే నివాసానికి బయలుదేరుతున్నారు. మిగతా పని సిబ్బంది కారో బార్ తో ఉదయం 7:00 గంటలకు ఫోటోలు పెట్టించుకుని సంబంధించిన గ్రూపుల్లో అప్డేట్ చేస్తారు వర్షాకాలం ప్రజలకు మురికి కుంటలు దోమల బెడత చెత్తచెదారం గ్రామాలలో పారిశుద్ధ్యం చేయించాల్సిన కార్యదర్శులు ఆ పనులు పట్టించుకోకుండా నింపదిగా వస్తుండడం పట్ల గ్రామాలలో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఎంపీ ఓ వివరణ
కార్యదర్శులు ప్రతి ఒక్కరూ స్థానికంగా ఉండాలి ఇoన్చార్జ్ ఎంపీడీవో..ఎంపీ ఓ.. దేవ వర కుమార్
పంచాయతీ కార్యదర్శులు ఉదయం ఏడు గంటలకల్లా పంచాయతీ పనుల్లో నిమగ్నమై ఉండాలని సూచించారు లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు