వనపర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కళ్యాణం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో శంకర్ గంజిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామి వారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించామని ఆలయ కమిటీ నిర్వాహకులు దాచ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు దాదాపు 90 మంది దంపతులు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నార ని ఆయన పేర్కొన్నారు సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి సేవ ఊరేగింపు లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు వైభవంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు అనంతరం భక్తులకు అభిషేకం తీర్థం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామి వారి కళ్యాణ ఉత్సవం భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించే పూజలు అదే తరహాలో వనపర్తి లో కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఆలయ కమిటీ సభ్యులు దాచా శివ న్యాయవాది ధార వెంకటేష్ ఈ పూరి వెంకటేష్ లగిశెట్టి శ్రీకాంత్ నూకల విజయ్ నూకల నాగరాజ్ చిట్యాల నరసింహ సేవలు అందించారు ఈ మేరకు ఆలయ పూజారి వెంకటేశ్వర శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు
