మల్కాజ్గిరి, నేటి ధాత్రి
మల్కాజగిరి నియోజకవర్గం 139 ఆనంద్ బాగ్ డివిజన్ పి వి ఎన్ కాలనీ లయన్స్ క్లబ్బులో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సింగ్ రావు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎంబిసి చైర్మన్ శ్రీధర్ తో కలసి బి.ఆర్.ఎస్ పార్టీ మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ నాపై నమ్మకం ఉంచి మల్కాజిగిరి లో సేవ చేసే అవకాశం ఇచ్చారని , ప్రజా సంక్షేమం కోసం తాను ఎల్లపుడూ కృషి చేస్తానని స్పష్టం చేశారు.అందరికీ అందుబాటు లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.