గుండాల మండలంలో మావోయిస్టు కరపత్రాలు

*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :*

గుండాల మండలం లో మావోయిస్ట్ కరపత్రాలు సంచలనం అయినాయి. ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయండి, సమస్యలు పరిష్కరించబడే వరకు ఎన్నికలను బహిష్కరించండి’ అని కోరుతూ మావోయిస్టు పార్టీ ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ పేరిట గుండాల మండలంలోని జామరగూడెం లో ఆంజనేయుని విగ్రహం వద్ద కరపత్రాలు దర్శనమిచ్చాయి.దాదాపుగా దశాబ్దం

కాలనంతరం మళ్లీ గుండాల మండలంలో మావోయిస్టు కరపత్రాలు వెలువడి కలకలం రేపుతోన్నాయి. ‘మహిళల్లారా.. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలను, నాయకులను నిలదీయండి అని. మీ సమస్యలను పరిష్కరించే వరకు ఎన్నికలను బహిష్కరించండి అని మహిళల మనుగడకు అడ్డంకిగా ఉన్న మనువాద పితృస్వామ్య భావజలాన్ని రూపుమాపుతారా? ….అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలను కల్పించగలరా?’ అని కరపత్రాల్లో రాసి ఉంది.
‘స్త్రీ-పురుష సమానత్వం కోసం కృషి చేయగలరా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాలయాల్లో నూటికి 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించగలరా? మహిళలపై ఏ విధమైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఉండవని సమాజంకై హామీని ఇవ్వగలరా? మా బతుకులను ఆగం చేస్తున్న మద్యంపై సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తారా? మహిళల ఎదుగుదలకు ఉచిత విద్యను హామీని ఇవ్వగలరా? వరకట్నాన్ని, వరకట్న వేధింపులను, హత్యలను రూపుమాపగలరా? మహిళా ప్రత్యేక చట్టాలను చిత్తశుద్దితో అమలు చేయగలరా? పరువు హత్యలను ఆపగలరా?’ అని మావోయిస్టు పార్టీ ప్రశ్నించింది.విద్యార్థులను కేజి టు పిజి ఉచిత విద్య కై ఉద్ఘాటించాలి అని.అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ,కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాల లను పునరుద్ధరించాలని ,పాఠశాలల్లో కాలిగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేయాలని కరపత్రం లో పొందు పరిచారు.రైతులు వారి సమస్యలను ,అలాగే ప్రతి కౌలు రైతుకి రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేయలని ఉంది.ప్రాజెక్టుల పేరిట పర్యావరణ కి జరిగే విధ్వంసాన్ని ఆపగలరా అని కరపత్రం లో ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *