
*”మంత్రి,కమిషనర్ గారు” అవినీతి ఉద్యోగులపై “ఓ కన్నెయ్యండి”.
మంత్రి పొంగులేటి రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షళన చేసి అధికారులను ట్రాన్స్‌పార్లు చేశారు
`ఏళ్ల తరబడి అదే కుర్చీలో కూర్చుంటున్నారు.
`ఒకప్పుడు సివిల్ సప్లయ్ శాఖ అంటే మాకొద్దనే వారు!
`ఇప్పుడు ఎమ్మార్వోలు, రెవిన్యూ అధికారులు ఎగబడుతున్నారు!
డిప్యూటేషన్ల మీద సివిల్ సప్లయ్ కోరుకుంటున్నారు.
`తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన పంటల దిగుబడితో అధికారులు పంట పండిరచుకుంటున్నారు.
`జీతానికి అదనంగా వందల రెట్లు సంపాదించుకుంటున్నారు!
`వందల కోట్లకు అధికారులు చేరుకుంటున్నారు.
సివిల్ సప్లై శాఖలో ‘‘డిసిఎస్ఓ’’,’’డిఎం’’ల సంపాదనకు లెక్కేలేదు.
`ఐదారేళ్లగ సంపాదనకు అంతే లేదు.
`మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారు.
`బాయిల్డ్ మిల్లర్లకు కల్పతరువులౌతున్నారు!
అక్రమంగా వడ్లు కేటాయించి లక్షలు లంచాలుగా తీసుకుంటున్నారు.
‘‘డిసిఎస్ఓ’’, ‘‘డిఎం’’లకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు సమకూర్చాల్సిందే!
ప్రతి సంవత్సరం టూర్ ప్యాకేజీలు చెల్లించాల్సిందే!
`ఎప్పుడు అడిగితే అప్పుడు అడిగినంత ముట్ట జెప్పాల్సిందే?
`లేకుంటే మిల్లర్ చుక్కలు చూడాల్సిందే?
రాజకీయ నాయకులకు కోట్లలో చందాలిచ్చేంత ‘‘డిసిఎస్ఓ’’, ‘‘డిఎం’’, ‘‘డిటి’’లు ఎదిగారు!
`నాయకుల ఆశీస్సులతో కుర్చీలలో పాతుకుపోయారు.
రిజిస్ట్రేషన్ శాఖలాగా ట్రాన్స్ఫర్లు చేస్తే తప్ప వ్యవస్థ మారదు.
గతంలో రిజిస్ట్రేషన్ శాఖలోనూ దశాబ్దాల తరబడి ట్రాన్స్ఫర్లు లేవు.
`సబ్ రిజిస్ట్రార్లు విచ్చలవిడి సంపాదనకు ఎగబడ్డారు.
`సరిగ్గా సివిల్ సప్లయ్ శాఖలో ఇదే జరుగుతోంది.
`ట్రాన్స్ఫర్లు లేక అధికారులు ఆడిరది ఆట, పాడిరది పాట చేసుకుంటున్నారు.
కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ముందు ట్రాన్స్ఫర్లు మొదలు పెడితే సివిల్ సప్లయ్ శాఖ సగం గాడిలో పడినట్లే!
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రభుత్వ కొలువు పాడి గేదే లాంటిది. ముప్పైపాటు ఒట్టిపోదు అనుకునేవారు. అంటే ఒక్కసారి ఉద్యోగంలో చేరితే జీవితం హాయిగా సాగుతుందనుకునే వారు. కాని ఇప్పుడు ప్రభుత్వ కొలువు అంటే విలాసం. జీతం లకారంలో వుంటుంది. లంచాలు లకారాలు దాటుతున్నాయి. ముఖ్యంగా కొన్ని శాఖల్లో కోట్ల రూపాయలు కూడా వచ్చిపడుతున్నాయి. ప్రభుత్వ కొలువు అంటే సేవ అనే భావం వుండేది. ఉద్యోగంలో చేరకముందు ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పుకునేవారు. అది ఐఏఎస్ నుంచి కింది స్దాయి ఉద్యోగుల దాకా ప్రజా సేవ అనే పదమే వినిపించేది. మరి ఇప్పుడు ఉద్యోగం అంటే కల్ప వృక్షం. సేవ సంగతి దేవుడెరుగు? ఎప్పుడు ఎంత సంపాదించాలి? ఎలా సంపాదించాలి? ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకోవాలి. అక్రమ మార్గాలు అన్వేషించి లంచాలు ఎలా తినాలి. ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేయాలి. అనేదే చాలా మంది ఉద్యోగులు అనుసరిస్తున్న విధానం. ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు లంచం తీసుకుంటూ వుండేవారు. బియ్యంలో రాళ్లలాలా వుండేవారు. కాని ఇప్పుడు రాళ్లలో బియ్యంలా ఒకరో ఇద్దరో లంచాలు తీసుకోని వారున్నారు. ఇదీ ఇప్పటి ఉద్యోగుల పరిస్దితి. గతంలో ఒకటో రెండో శాఖల్లో అవినీతి జరుగుతుందని అనుకునే వారు. కాని ఇప్పుడు అన్ని శాఖల్లోనూ అవినీతి దూరింది. ముఖ్యంగా కొన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అలాంటి శాఖలో సివిల్ సప్లై శాఖ ఒకటి. ఈ శాఖలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు తలనొప్పి అనుకునేవారు. విపరీతమైన పని వుంటుంది. కాణి కూడా లంచం దొరకదనుకునే వారు. కాని ఇప్పుడు సివిల్ సప్లై శాఖలో కొలువు అంటే ఎగిరి గంతేస్తున్నారు. సివిల్ సప్లైలో ఉద్యోగం కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు రెవిన్యూ వ్యవస్ధ నుంచి సివిల్ సప్లై శాఖకు డిప్యూటేషన్ మీద వెళ్లేందుకు ఎగబడుతున్నారు. రెవిన్యూ శాఖలో కింది స్ధాయి నుంచి తహసిల్ధార్ వరకు సివిల్ సప్లై శాఖకు వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. కావాలని కోరుతున్నారు. ఖర్చుకు కూడా వెనుకాడకుండా ఫైరవీలు చేయించుకుంటున్నారు. ఇదిలా వుంటే ఏడెనమిదేళ్ల క్రితం నుంచి డిప్యూటేషన్‌మీద వెళ్లిన అధికారులు కొందరు అక్కడే తిష్ట వేసుకుపోయారు. గతంలో మన తెలంగాణలో పంటల దిగుబడి తక్కువ. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మూలంగా తెలంగాణ విస్తారమైన వ్యవసాయం సాగుతోంది. రికార్డు స్దాయిలో పంటలు పండుతున్నాయి. అందులో ముఖ్యంగా వరి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ మారిపోయింది. దాంతో రెవిన్యూ వ్యవస్ధకంటే ఎక్కువ ఆదాయం సమకూర్చే శాఖగా సివిల్ సప్లై మారిపోయింది. ఇక అక్కడి నుంచి అదికారుల పంట పండిరది. తెలంగాణలో గతంలో వందల సంఖ్యలో వున్న రైస్ మిల్లులు వేల సంఖ్యకు చేరుకున్నాయి. రైస్ మిల్లులకు వడ్లను సమకూర్చే అదికారం వారి చేతుల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా డిసిఎస్వో( డిస్టిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్) డిటి. (డిస్టిక్ తహసిల్ధార్) , డిఎం. (డిస్టిక్ట్ మేనేజర్) స్దాయి ఉద్యోగులకు పండగే పండుగగా మారింది. వారికి వద్దన్నా లంచాలు వచ్చిపడే కామదేనువుగా సివిల్ సప్లై శాఖ మారింది. మిల్లులకు వడ్లు ఇవ్వడానికి, ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చిన మిల్లర్ల నుంచి బియ్యం సేకరించడానికి రెండు రకాల ఆదాయాలుగా అధికారులకు మారిపోయింది. సహజంగా ఒక ఉద్యోగికి ఒకే రకమైన లంచం వస్తుంది. కాని ఇక్కడ రెండు రకాల లంచాలు వచ్చే ఏకైక శాఖ సివిల్ సప్లైశాఖ అని ఉద్యోగులు చెప్పుకుంటారు. డిసిఎస్‌లో, డిటిలు మిల్లులకు వడ్లు కేటాయిస్తుంటారు. డిఎం. మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే బాద్యతలు నిర్వర్తిస్తుంటారు. దాంతో కింది నుంచి పై స్దాయి దాకా ఆదాయమే ఆదాయం అన్నట్లు మారిపోయింది. దాంతో అదే శాఖలో అదే కుర్చీలో ఏళ్ల తరబడి పై స్దాయి ఉద్యోగులు తిష్ట వేశారు. ఒక రకంగా పాతుకుపోయారు. వారికి అందే లంచాల కింద జీతం బియ్యంలో మెరిగలా మారిపోయింది. జీతానికి వంద రెట్లు లంచాలు అందుతున్నాయి. మిల్లర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న వార్తలు అనేకం వున్నాయి. సివిల్ సప్లైశాఖలో డిఎస్ఓలు, డిఎం సంపాదనలకు లెక్కే లేదని అంటున్నారు. ఎక్కడా లంచం తీసుకున్నట్లు కూడా కనిపించదు. ఐదారేళ్లుగా ఇలా పాతుకుపోయిన అనేక మంది అదికారులు మిల్లర్లను పీల్చి పిప్పి చేస్తున్నారని సమాచారం. అక్రమంగా మిల్లర్లకు వడ్లు కేటాయించి, లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. దాంతో డిఎస్ఓలు, డిఎంలకు ఏ అవసరం వచ్చినా మిల్లర్లు ఎంత అడిగితే అంత సమకూర్చాల్సిందే. అధికారులు టూర్ వెళ్లే ప్యాకేజీలు చెల్లించాల్సిందే. ఎప్పుడు అడితే అప్పుడు, ఎంతఅడిగితే అంత ముట్ట చెప్పాలిందే? లేకుంటే మిల్లర్లకు చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సివిల్ సప్లైశాఖలో అధికారుల సంపాదన ఎంత దూరం వెళ్లిందంటే రాజకీయ నాయకులకు, పార్టీలకు ఫండిరగ్ చేసేంత సంపాదిస్తున్నారు. కుర్చీలను కాపాడుకుంటున్నారు. అదే కుర్చీలో కూర్చోవాలంటే అధికారపార్టీ పెద్దలకు కోట్ల రూపాయలు పార్టీ ఖర్చులకు సమకూర్చుతున్నారంటే ఏ స్ధాయిలో అదికారులు సంపాదిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అధికారులకు అవసరం వచ్చినా, నాయకుల అవసరాలను తీర్చాల్సిన పరిస్దితి ఎదురైనా సరే మిల్లర్ల నుంచి దండిగా వసూలుచేయడం అలవాటు చేసుకున్నారు. రెండు రకాలుగా మిల్లర్ల నుంచి సంపాదిస్తున్నారు. దీనంతటికీ ఆ అధికారులు మాతృ శాఖలకు వెళ్లకపోవడం, అదే కుర్చీలలో ఏళ్ల తరబడి పాతుకుపోవడం వల్ల సంపాదిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌శాఖలో కూడా ఇలాంటి వ్యవహరమే సాగేది. ఉమ్మడిరాష్ట్రం నుంచి రేవంత్ సర్కారు వచ్చే వరకు సుమారు పదమూళ్లు పాటు రిజిస్ట్రేషన్ శాఖలో ట్రాన్స్ఫర్లు జరగలేదు. ప్రమోషన్లు వచ్చినా సబ్ రిజిస్ట్రార్లు వద్దనుకున్నారు. పదమూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తూవచ్చారు. ఆ ప్రాంతంమీద పూర్తిపట్టు సాధించారు. లంచాలకు బరితెగించారు. రేవంత్సర్కారు వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్లందిరికీ ట్రాన్స్ఫర్లు చేయించారు. జోన్లు దాటించారు. సరిగ్గా ఇప్పుడు సివిల్ సప్లైలోనూ అదే పనిచేయాలి. అలా చేస్తే తప్ప అదికారుల విచ్చలవిడి అవినీతి తగ్గదు. ప్రభుత్వాదాయానికి గండిపడదు. సివిల్ సప్లై నూతన కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నింటికన్నా ముందు ఉద్యోగులను జోన్లు దాటిస్తే శాఖను సగం గాడిలో పెట్టినట్లే అంటున్నారు. గత కమీషనర్ ఈ నిర్ణయం తీసుకునేలోపు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏ ఏ జిల్లాలలో ఏ అదికారి పాతుకుపోయారు. వారి సంపాదనలు ఎలా వున్నాయి? వారి వివరాలతో కూడిన సమగ్ర సమచారాలు మీ నేటిదాత్రిలో త్వరలో వరుస కథనాలు…