తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక వైట్ హౌస్ లో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో పలు గ్రామాల నుండి పలువురు కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు కేకే మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో కట్కూరు రాళ్లపేట మండపల్లి రామచంద్రపురం చిన్నలింగాపూర్ గండిలచ్చపేట ఇతర గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినారుఇంతకు ముందున్న ప్రభుత్వం ప్రజలను బయటకు రానీయకుండా చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పలువురు స్వేచ్ఛ వాతావరణంలో ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని కనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరి ఏ పార్టీలో ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి పార్టీలో ఎవరైనా గ్రూప్ రాజకీయాలు చేయవద్దని అందరు కలిసికట్టుగా ఉండటం మంచిదని ఏదైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకొస్తే తగిన పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు మహిళా నాయకురాలు మైనార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు