మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి వారి స్వగ్రామమైన నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామికి వారి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సొంత గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్,మాజీ మంత్రివర్యులు లక్ష్మా రెడ్డి, మాజీ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్ తో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతరం మీడియాతో సమావేశమై
100 రోజుల్లో చెప్పిన హామీలను నిలబెట్టుకుంటామన్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మహబూబ్ నగర్ జిల్లాలో కరెంటు కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారు మార్పు కోసం బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు.ఓటమి భయంతోనే ఇరు పార్టీలు కలిసి తనపై అభాండాలు వేస్తున్నాయని తన జీవితం తెల్లని కాగితమని… తన ట్రాక్ రికార్డ్ ఎవరైనా పరిశీలించవచ్చని అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ బిజెపి పార్టీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని,
తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బి ఆర్ ఎస్, వైపే బ్రహ్మరథం పడుతున్నారని మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు.తాము చేసిన అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతున్నామన్నారు. గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని.. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా నని నమ్మ పలుకుతున్నాడు. ప్రతిపక్ష నేతలు గెలుస్తామని గాలిలో మేడలు కడుతున్నారని..పాలమూరులో వచ్చేది బీఆర్ఎస్ పార్టీనని అన్నారు.మహబూబ్నగర్ అభివృద్ధికి తాను రోజుకు 18 గంటలు కష్టపడ్డానని. పాలమూరు లో వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని.. మహబూబ్నగర్లో తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని, తన విజయం ఖాయమని చెప్తు ధీమాగా ఉన్నాడు