మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మంగళవారం రోజు ఉదయం పాలమూరు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్నా కుమారుడైన మన్నే జీవన్ రెడ్డి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు.
కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ అయి అనంతరం ఖర్గేని కలిశారు. ఈ కార్యక్రమంలో
ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ. మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ. కేసీ వేణుగోపాల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి .ఉప ముఖ్యమంత్రి భట్టి ,తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లు రవి ,సి డబ్ల్లు సి.మెంబెర్ చల్లా వంశీ చంద్ రెడ్డి ,జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. జి. మధుసూధన్ రెడ్డి (జీఎంర్ ) మరియు జిల్లా ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.